T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌‌కు ఇషాన్ కిషన్‌ ఎంపిక దాదాపు కష్టమే.. 20 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితా ఇదే!

  • 20 మంది ఆటగాళ్లకు ప్రాబబుల్స్‌లో చోటు దక్కకపోవచ్చంటున్న బీసీసీఐ వర్గాలు
  • జట్టు ఎంపికలో ఆశ్చర్యపరిచే విషయాలు ఉండకపోవచ్చన్న బీసీసీఐ సీనియర్ అధికారి
  • మూడో వికెట్ కీపర్ విషయంలో గట్టి పోటీ నెలకొనే అవకాశం
No Ishan Kishan among Indias 20 probables for T20 World Cup

సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కాబోయే ఆటగాళ్లు ఎవరెవరు అనే ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితాను 20 మంది ప్లేయర్లకు బీసీసీఐ కుదించిందని, జట్టు ఎంపికలో పెద్దగా ఆశ్చర్యపరిచే విషయాలు ఏవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదివరకే పరీక్షించిన ఆటగాళ్లను.. ఐపీఎల్‌లో వారి ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘‘ఎటువంటి ప్రయోగాలు, ఆశ్చర్యాలు ఉండవు. భారత్ తరపున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన వారికి ఐపీఎల్‌లో నిలకడ రివార్డుగా ఉండొచ్చు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్టు వివరించాయి.

మొదటి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంతో రెండవ వికెట్‌ కీపర్ స్థానం కోసం గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్ పోటీ పడుతున్నారు. అయితే జితేశ్ శర్మ రేసులో వెనుకబడ్డట్టే. ఐపీఎల్‌కు ముందు టీమిండియా టీ20 జట్టు ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్‌గా జితేశ్ కొనసాగినప్పటికీ ప్రస్తుతం అతడిని ఎంపిక చేసే అవకాశాలు కనిపించడంలేదని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. 

ఇక శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ మధ్య పోటీ నెలకొనే సూచనలు ఉన్నాయి. స్పిన్నర్ల విషయంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు మొదటి రెండు ఆప్షన్లుగా ఉన్నారు. మూడో స్పిన్నర్‌పై సెలక్టర్లు చర్చించే అవకాశం కనిపిస్తోంది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌లతో అక్షర్ పటేల్ పోటీ పడే అవకాశాలున్నాయి. కాగా హార్ధిక్ పాండ్యా పేరు ఎక్కడా వినిపించడం లేదు. అతడికి జట్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

20 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్ అంచనా జాబితా..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

More Telugu News